చిన్నకోడూరు రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించండి :ఎంపీ రఘునందన్రావు

చిన్నకోడూరు రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించండి :ఎంపీ రఘునందన్రావు
  • సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను కోరిన ఎంపీ రఘునందన్​రావు
  • ఎంఎంటీఎస్​ రైళ్ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో మంజూరైన రైల్వే స్టేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని, పూర్తయిన కొమురవెల్లి రైల్వే స్టేషన్‌‌ను త్వరగా ప్రారంభించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను కోరారు. మంగళవారం రైల్వే జీఎంను కలిసి తన పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు.

ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా మల్టీ మోడల్ ట్రాన్స్‌‌పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్) సేవలను విస్తరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. తెల్లాపూర్ నుంచి ఈదుల నాగులపల్లి, ఇక్రిసాట్ వరకు ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచాలని కోరారు. ఈదుల నాగులపల్లి ప్రాంతంలో రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెల్లాపూర్ ఎంఐజీ ప్రాంతం మధ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి, డీపీఆర్‌‌ను త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. అక్కన్నపేట రైల్వే స్టేషన్ వద్ద అజంతా, రాయలసీమ ఎక్స్‌‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.