ధర్మపురిలో వైభవంగా డోలోత్సవం 

ధర్మపురిలో వైభవంగా డోలోత్సవం 

ధర్మపురి(పెగడపల్లి), వెలుగు: ధర్మపురి పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం డోలోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే శ్రీయోగ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన పల్లకీలో స్వామివారిని ఊరేగించారు.

ఉదయం 6 గంటలకు కోనేరుకు స్వామివారిని తీసుకెళ్లి, భోగమంటపంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైభవంగా డోలోత్సవం నిర్వహించి తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ చైర్​పర్సన్​ వేముల నాగలక్ష్మి రాజేశ్, వైస్ చైర్​పర్సన్ ఇందారపు రామన్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.