Actor Shivaji: మహిళా కమిషన్ ముందు హాజరైన నటుడు శివాజీ..

Actor Shivaji: మహిళా కమిషన్ ముందు హాజరైన నటుడు శివాజీ..

నటుడు శివాజీ.. ఓ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో 'హీరోయిన్ల వస్త్రధారణ'పై చేసిన కామెంట్స్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాతో పాటుగా సినీ ఇండస్ట్రీలో శివాజీ 'టాక్ అఫ్ ది పర్సన్'గా మారారు.

ఇందులో భాగంగా శివాజీ చేసిన కామెంట్స్పై ఇండస్ట్రీలో పలువురు భిన్నరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.వస్త్రధారణ అనేది మహిళల హక్కు అని.. ఉచిత సలహాలు ఇవ్వడానికి ఆయనెవరని.. అనసూయ, చిన్మయి శివాజీ వ్యాఖ్యలను ఖండించడంతో వివాదం మరింత ముదిరింది. శివాజీ మాట్లాడిన భాష, వాడిన పదాలు తప్పేనని.. కానీ ఆయన చేసిన హిత బోధ మంచిదేనని కరాటే కల్యాణి లాంటి కొందరు ఆయనను సమర్థించడంతో టాలీవుడ్లో ఈ వివాదం హాట్ టాపిక్ అయింది.

ఈ క్రమంలోనే తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు నటుడు శివాజీ ఇవాళ విచారణకు హాజరయ్యారు. శనివారం (2025 డిసెంబర్ 27న) సికింద్రాబాద్ బుద్ధ భవన్లో గల మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు శివాజీ. మరి ఈ విచారణలో శివాజీ ఇచ్చే వివరణపై, కమిషన్ ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. 

ALSO READ : పశువుల్లా ప్రవర్తించకండి: కచేరీలో ఉద్రిక్తత.. 

ఇకపోతే, శివాజీ తాను చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు, తన ఉద్దేశం చెడు కాదని, కొన్ని అభ్యంతరకరమైన పదాలు వాడడం పొరపాటని వెల్లడించిన విషయం తెలిసిందే!!