వరల్డ్ కప్కు ముందు కీలక సిరీస్కు కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ

వరల్డ్ కప్కు ముందు కీలక సిరీస్కు కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ

ఇండియన్ క్రికెట్ లో ఒకప్పుడు సచిన్ చిన్న వయసులో ఎలా ఆశ్చర్య పరిచాడో.. ఈ లేటెస్ట్ జనరేషన్ లో అలాంటి వండర్స్ క్రియేట్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. చాలా తక్కువ టైమ్ లోనే కెప్టెన్సీ అందిపుచ్చుకునేలా ఎదిగాడు. త్వరలో అండర్-19 వరల్డ్ కప్ జరగనున్న తరుణంలో.. అంతకు ముందు ఉన్న కీలక సిరీస్ కు కెప్టెన్ గా చాన్స్ కొట్టాడు. 

2026 జనవరి 15 నుంచి  ఫిబ్రవరి 06 వరకు జింబాబ్వే, నమీబియాలో ఐసీసీ మెన్స్ U-19 వరల్డ్ కప్ జరుగుతుంది. అంతకు ముందు సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఉంది. అండర్-19 ప్రపంచ కప్ స్క్వాడ్ తో పాటు మూడు వన్డేల సిరీస్ కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. 

ఈ జట్టుకు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. ఆరోన్ జ్యార్జ్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు. అయితే కేవలం 14 ఏళ్ల సూర్య వంశీ కెప్టెన్ కావడం విశేషం. వరల్డ్ కప్ టీమ్ కు కెప్టెన్ అయిన ఆయుశ్ మాత్రే మణికట్టు గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరం కానున్నాడు. అలాగే వరల్డ్ కప్ వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా కూడా ఈ సిరీస్ కు దూరంగా ఉండనున్నాడు.

దక్షిణాఫ్రికా సిరీస్ కు భారత జట్టు:

వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్‌ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఎ. పటేల్, మహమ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, డి రాహుల్ కుమార్, మోహన్ కుమార్, ఉద్రాజ్, కిహిల్ కుమార్.

►ALSO READ | ఇండియా అండర్-19 వరల్డ్ కప్ జట్టు ఇదే.. వైభవ్ సూర్యవంశీకి చోటు.. కెప్టెన్గా ఆయుష్ మాత్రే