ఇండియా అండర్-19 వరల్డ్ కప్ జట్టు ఇదే.. వైభవ్ సూర్యవంశీకి చోటు.. కెప్టెన్గా ఆయుష్ మాత్రే

ఇండియా అండర్-19 వరల్డ్ కప్ జట్టు ఇదే..  వైభవ్ సూర్యవంశీకి చోటు.. కెప్టెన్గా ఆయుష్ మాత్రే

 అండర్-19 వరల్డ్ కప్ స్క్వాడ్ విడుదల చేసింది బీసీసీఐ జూనియర్ క్రికెట్  కమిటీ. శనివారం (డిసెంబర్ 27) సాయంత్రం విడుదల చేసిన జట్టులో డ్యాషింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. దీనితో పాటు సౌతాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్ లకు జట్టును ప్రకటించింది. 

2026 జనవరి 15 నుంచి  ఫిబ్రవరి 06 వరకు జింబాబ్వే, నమీబియాలో ఐసీసీ మెన్స్ U-19 వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ ప్రపంచ కప్ లో 16 టీమ్స్ పాల్గొంటున్నాయి. మొత్తం నాలుగు గ్రూపులుగా, సూపర్ సిక్స్ స్టేజ్, సెమీ ఫైనల్ తో పాటు హరారేలో ఫైనల్ ఉంటుంది. 

►ALSO READ | విజయ్ హజారే ట్రోఫీ: ఒక్కో మ్యాచ్కు కోహ్లీ, రోహిత్ ఎంత శాలరీ తీసుకుంటారో తెలుసా ?

ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఇండియా గ్రూప్-B లో ఉంది. ఈ గ్రూప్ లో న్యూజీలాండ్,బంగ్లాదేశ్, అమెరికా ఉన్నాయి. జనవరి 15న బులవాయోలోని స్పోర్ట్స్ క్లబ్ లో యూఎస్ఏతో ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత 17 న బంగ్లాదేశ్, 24న న్యూజీలాండ్ తో పోరుకు దిగుతుంది. 

ICC మెన్స్ U19 వరల్డ్ కప్-2026 కోసం ఇండియా టీమ్: 

ఆయుష్ మాత్రే (C), విహాన్ మల్హోత్రా (VC), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (wk), హర్వాన్ష్ సింగ్ (wk), R.S. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఎ. పటేల్, మహ్మద్ ఈనాన్, హెనిల్ పటేల్, డి. దీపేష్, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్