చాలా రోజుల తర్వాత కోహ్లీ, రోహిత్ లాంటి స్టార్ ప్లేయర్స్ విజయ్ హజారే ట్రోఫీ ఆడటం ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడినా, ఎన్నో రికార్డులు సాధించినప్పటికీ లోకల్ వైట్ బాల్ క్రికెట్ కూడా ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలతో వీరిద్దరూ రంగంలోకి దిగి దుమ్ములేపుతున్నారు. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
విజయ్ హజారే ట్రోఫీ ఐపీఎల్ లాంటి కిక్కు ఇవ్వకపోయినా.. రోకో ఎంట్రీతో ఫుల్ ఫోకస్ లోకి వచ్చింది. అయితే ఐపీఎల్ లో కోట్లు తీసుకునే ఈ స్టార్ ప్లేయర్లు ఈ వైట్ బాల్ క్రికెట్ లో మ్యాచ్ కు ఎంత తీసుకుంటారు అనే చర్చ నడుస్తోంది. ఇద్దరూ బీసీసీఐ కాంట్రాక్ట్ ప్లేయర్స్ అయినప్పటికీ.. ఐపీఎల్ లో సంపాదించినంత ఈ ట్రోఫీలో ఇవ్వరు. 2025-26 సీజన్ చెల్లింపుల వివరాలు ఇలా ఉన్నాయి.
విజయ్ హజారే ట్రోఫీ శాలరీ విధానం:
ఐపీఎల్ లాంటి సిరీస్ లలో ప్లేయర్లకు వేలం ద్వారా చెల్లిస్తుండగా.. విజయ్ హజారే ట్రోఫీలో శాలరీలు ఫిక్సుడుగా ఉంటాయి. ఒక ప్లేయర్ ఎన్ని లిస్ట్-A మ్యాచ్ లు ఆడాడు అనేదే ఇక్కడ ప్రాతిపదిక.
ఒక్కో గేమ్ కు మ్యాచ్ ఫీ:
సీనియర్ కేటగిరి: (40 కి పైగా మ్యాచ్ లు ఆడినవారు)
ప్లేయింగ్ లెవెన్ లో ఉంటే మ్యాచ్ కు రూ.60 వేలు
రిజర్వ్ లో ఉంటే మ్యాచ్ కు రూ.30 వేల శాలరీ
మిడ్ లెవెల్ కేటగిరీ: (21 నుంచి 40 మ్యాచ్ లు)
ప్లేయింగ్ XI: మ్యాచ్ కు రూ. 50 వేలు
రిజర్వ్ : మ్యాచ్ కు రూ 25 వేలు
జూనియర్ కేటగిరీ: (0 నుంచి 20 మ్యాచ్ లు)
ప్లేయింగ్ XI: మ్యాచ్ కు రూ. 40 వేలు
రిజర్వ్ : మ్యాచ్ కు రూ 20 వేలు
కోహ్లీ, రోహిత్ ఎంత సంపాదిస్తారంటే..
ప్రస్తుత సీజన్ లో కోహ్లీ ఢిల్లీకి, రోహిత్ ముంబైకి ఆడుతున్నారు. ఇద్దరూ 40 కి పైగా మ్యాచ్ లు ఆడారు కాబట్టి.. ఒక్కో గేమ్ కు వాళ్లు 60 వేల రూపాయలు శాలరీ పొందుతారు. బీసీసీఐ వన్డే మ్యాచ్ తో పోల్చినప్పుడు.. ఒక్క వన్డే మ్యాచ్ కు 6 లక్షల రూపాయలు ఇస్తుంటుంది బీసీసీఐ. కానీ ఇక్కడ కేవలం 60 వేలతో సరిపెట్టుకోవాలి. దీనితో పాటు ట్రావెల్, ఫుడ్, అకామొడేషన్ అలొవెన్స్ లు ఉంటాయి.
►ALSO READ | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 14 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ గెలుపు !
ఇక ఈ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు పర్ఫామెన్స్ బోనస్ కింద.. రూ.10 వేల క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అయితే మ్యాచ్ కు 60 వేల రూపాయలు తీసుకుంటున్న కోహ్లీ, రోహిత్.. పర్ఫామెన్స్ ప్రైజ్ ప్రకారం మరింత సంపాదించే అవకాశం ఉంది.
