T20 World Cup: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ Dలోని కెనడా, UAE పోటీ పడతున్నాయి. టాస్ గెలిచిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన కెనడా.. స్టార్టింగ్ నుంచే తడబడింది. తొలి 3 ఓవర్లలో కీలకమైన 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెనడా ఓపెనర్లు యువరాజ్ శర్మ (5), కెప్టెన్ దిల్ ప్రీత్ బజ్వా ( 11), నిలోలస్ కిర్టన్ (4) పరుగులకే అవుట్ అయ్యారు.
హిట్టర్ గా పేరున్న వననీత్ థాలివాల్ 28 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మరో ఆటగాడు హర్ష టకర్ హాఫ్ సెంచరీ చేయడంతో కెనడ 150 పరుగుల మార్క్ ను అందుకుంది. ఒక వైపు, తన వికెట్ కాపాడుకుంటునే జట్టుకు కావాల్సిన పరుగులను శ్రేయాస్ మొవ్వ (21)తో కలిసి పరుగులు రాబట్టాడు హర్ష టకర్. మరోవైపు, అమెరికా బౌలర్లు చెలరేగిపోయారు. జునైద్ సిద్ధిఖీ 4 ఓవర్లు వేసి.. 5 వికెట్లు తీసుకోగా.. మరో బౌలర్ మహ్మద్ జవాదుల్లా 4 ఓవర్లు వేసి 16 రన్స్ ఇచ్చి.. ఒక వికెట్ తీసుకున్నాడు.
లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ మూడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 11 పరుగులకే ఓపెనర్ ముహమ్మద్ వసీం 8 బాల్స్ లో కేవలం 4 రన్స్ మాత్రమే చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఆర్యన్ శర్మ, అలీషన్ షరాఫు ఉన్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది యూఏఈ జట్టు.
