ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 14 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ గెలుపు !

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 14 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ గెలుపు !

ఒకటి కాదు రెండు కాదు.. వాళ్లది 14 ఏళ్ల కల. ఒక్క మ్యాచ్ అయినా  ఆసీస్ ను వాళ్ల సొంత గడ్డపై ఓడించాలి.. అదే తమకు సిరీస్ గెలిచినంత గొప్ప.. అనుకుంటూ కసితో ఎదురు చూస్తున్న టీమ్ కు.. ఎట్టకేలకు సుదీర్ఘ కాలం వేచిన విజయం ఇంగ్లండ్ ఖాతాలో పడింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కేవలం రెండు రోజుల్లోనే టెస్టును పూర్తి చేసి గెలుపును ఖాతాలో వేసుకుంది ఇంగ్లండ్ టీమ్. 

రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ను కేవలం 132 రన్స్ కే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. ముందున్న 175 రన్స్ లక్ష్యాన్ని రెండో రోజు సాయంత్రం వరకే ఛేదించింది. 3-1 తేడాతో సిరీస్ ఆస్ట్రేలియా సొంతం చేసుకున్నప్పటికీ.. 14 ఏళ్ల తర్వాత దక్కిన గెలుపు కిక్కును ఎంజాయ్ చేస్తున్నారు ఇంగ్లండ్ ప్లేయర్లు. 

ఈ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్ మాట్లాడుతూ.. ఇది చాలా చాలా స్పెషల్ మ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో గెలవటం చాలా ప్రత్యేకం అని ఆనందాన్ని పంచుకున్నాడు.  2011 నుంచి ఆస్ట్రేలియాలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఇంగ్లండ్ గెలవక పోవడం గమనార్హం. 

ALSO READ : విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ కు రెండో ఓటమి

మెల్ బోర్న్ టెస్ట్ స్కోర్స్:

ఆస్ట్రేలియా: ఫస్ట్ ఇన్నింగ్స్: 152: నేసర్ 35; టంగ్ 5-45 & సెకండ్ ఇన్నింగ్స్ 132: హెడ్ 46; కార్స్ 4-34

ఇంగ్లాండ్: ఫస్ట్ ఇన్నింగ్స్ 110: బ్రూక్ 41; నేసర్ 4-45 & సెకండ్ ఇన్నింగ్స్ 178-6: బెథెల్ 40, క్రాలీ 37