రాజ్‌కోట్: బ్యాటింగ్‌లో ఫెయిలైన హైదరాబాద్.. విజయ్ హజారే ట్రోఫీలో రెండో ఓటమిని ఎదుర్కొంది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో వరుణ్ గౌడ్ (85), అభిరత్ రెడ్డి (43) మినహా మిగతా వారు నిరాశపర్చడంతో.. శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్–బి మ్యాచ్‌లో హైదరాబాద్ 89 రన్స్ తేడాతో విదర్భ చేతిలో ఓడింది. టాస్ ఓడిన విదర్భ 50 ఓవర్లలో 365/5 స్కోరు చేసింది. ధ్రువ్ షోరే (109 నాటౌట్) సెంచరీతో చెలరేగగా, అమన్ మోఖడే (82), యష్ రాథోడ్ (68), రవికుమార్ సమర్థ్ (63) అండగా నిలిచారు. కార్తికేయ 3, రక్షణ్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్ చెరో వికెట్ తీశారు. తర్వాత హైదరాబాద్ 49.2 ఓవర్లలో 276 రన్స్‌కే ఆలౌటైంది. రాహుల్ సింగ్ (37), ప్రజ్ఞయ్ రెడ్డి (25), అనికేత్ రెడ్డి (24), తన్మయ్ అగర్వాల్ (21) మోస్తరుగా ఆడారు. ధ్రువ్ షోరేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
