తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కీలక ట్వీట్ చేశారు సీఎం రేవంత్. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్.
ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని... పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనమని అన్నారు. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని ట్వీట్ లో పేర్కొన్నారు సీఎం రేవంత్.
రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
— Revanth Reddy (@revanth_anumula) February 13, 2026
ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన…
►ALSO READ | నిజామాబాద్ కార్పొరేషన్ ఫైనల్ రిజల్ట్: 60కి 28 డివిజన్లలో బీజేపీ విజయం
అదేవిధంగా రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని అన్నారు సీఎం రేవంత్.ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని.. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ట్వీట్ చేశారు సీఎం రేవంత్.
