నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. బీజేపీ 28 డివిజన్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు17 స్థానాల్లో గెలిచారు. ఎంఐఎం 14 స్థానాలు, బీఆర్ఎస్ ఒక స్థానంలో గెలిచింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో బుధవారం పోలింగ్ ముగిసింది.
3 లక్షల 48 వేల 051 మంది ఓటర్లకు గాను 2 లక్షల 05 వేల 753 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ముగిసే సమయానికి 59.12 శాతం ఓటింగ్నమోదైంది. లక్షా 67 వేల 461 మంది పురుషుల్లో 98 వేల 469 మంది ఓటు వేయగా, లక్షా 80 వేల 546 మహిళలకు గాను లక్షా 07 వేల 282 మంది ఓటు వేశారు. ఇతరులు 44 మందిలో ఇద్దరు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైందంటే..
నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను బీఆర్ఎస్13 చోట్ల మాత్రమే గెలిచినా 16 మంది మజ్లిస్, ఒక ఇండిపెండెంట్కార్పొరేటర్, ఐదుగురు ఎక్స్ అఫీషియో మెంబర్ల బలంతో సిటీలో జెండా ఎగరేసింది. బీఆర్ఎస్ కార్పొరేటర్దండు నీతూకిరణ్ మేయర్గా ఎన్నికై ఐదేళ్లు పదవిలో కొనసాగారు. బీజేపీ సొంతంగా 28 చోట్లా గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా మేయర్ పదవిని దక్కించుకోలేకపోయింది.
►ALSO READ | 75 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
