8 రోజుల్లో 6 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి! ఇండియన్ ఐటీ పరిశ్రమను AI నాశనం చేస్తుందా ?

8 రోజుల్లో 6 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!  ఇండియన్ ఐటీ పరిశ్రమను AI నాశనం చేస్తుందా ?

భారతదేశంలోని $250 బిలియన్ల సాఫ్ట్‌వేర్ సేవల పరిశ్రమ ఈ రోజుల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. గత కొన్ని రోజులుగా చూస్తే ఐటీ స్టాక్‌లు తీవ్ర నష్టాలను చూస్తున్నాయి. ఇక గడిచిన 8 రోజుల్లో ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5.7 లక్షల కోట్లు తగ్గింది. ఈ కాలంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 20% పడిపోగా, గత రెండు రోజుల్లోనే దాదాపు 10% తగ్గింది. చాల  పెద్ద ఐటీ కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి, రానున్న  భవిష్యత్తులో ఎటువంటి ఉపశమనం లభించే అవకాశం కూడా లేదు.

గత వారం రోజుల్లో చూస్తే ఇన్ఫోసిస్ షేర్లు 21% తగ్గగా, టీసీఎస్ షేర్లు 19%, హెచ్‌సీఎల్ టెక్ 17%, విప్రో, టెక్ మహీంద్రా 13% తగ్గాయి. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ షేర్లు గత ఏడాది ఆగస్టులో నమోదైన గరిష్ట స్థాయి నుండి 44% పడిపోయాయి. దీని వల్ల కంపెనీ మార్కెట్ క్యాప్  10 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉంది. గతంలో 2020లో టీసీఎస్ ఈ స్థాయిలో ఉండేది. నేటి ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్లు 7 శాతం తగ్గగా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో 4 నుంచి 5 శాతం వరకు పడిపోయాయి.

ఎందుకు తగ్గింది:
అమెరికన్ AI డెవలపర్ కంపెనీ ఆంత్రోపిక్  కొత్త టూల్స్ క్లౌడ్ 4.6, కోవర్క్‌లను విడుదల చేసింది. ఇవి IT కంపెనీలకు వినాశనాన్ని కలిగిస్తాయని నమ్ముతారు. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ... భారతదేశ IT సేవల పరిశ్రమలో AI నిర్మాణాత్మక మార్పుకు దారితీస్తోందని, ఇది భవిష్యత్తులో కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. అలాగే తొలగింపుల ప్రమాదాన్ని పెంచుతోంది, అంటే భవిష్యత్తులో IT పరిశ్రమ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. 

►ALSO READ | ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ ఎందుకు క్యాన్సల్ చేసుకుంటున్నారు? "QuitGPT" వెనుక అసలు కథ ఇదే..

మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్‌లో చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ రవి సింగ్ మాట్లాడుతూ, IT రంగం నిర్మాణాత్మక మార్పులను ఎదుర్కొంటోందని, ఇది స్టాక్‌లపై ఒత్తిడిని కలిగిస్తుందని అన్నారు. USలో టెక్ స్టాక్‌లు కూడా క్షీణించాయి, US ఇంకా యూరప్‌లోని క్లయింట్లు ITపై ఖర్చు చేయడంలో జాగ్రత్తగా వహిస్తున్నారు. ఇవన్నీ IT కంపెనీ స్టాక్‌లపై ప్రభావం చూపుతున్నాయి. అయితే, పానిక్ సెల్లింగ్‌కు దూరంగా ఉండాలని పెట్టుబడిదారులకు ఆయన సూచించారు.