ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ప్రియాంక అభినందనలు..

ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ప్రియాంక అభినందనలు..

ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో  సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో శుక్ర‌వారం ( ఫిబ్రవరి 13 ) సాయంత్రం జరిగిన ఈ భేటీలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డంపై ప్రియాంక గాంధీ హ‌ర్షం వ్య‌క్తం చేసినట్లు సమాచారం. 

సీఎం రేవంత్ ను ప్రియాంక ప్ర‌త్యేక్యంగా అభినందించినట్లు సమాచారం. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నారు కాబట్టే.. కాంగ్రెస్ పార్టీకి ఘ‌న విజ‌యం క‌ట్ట‌బెట్టార‌ని ప్రియాంక గాంధీకి తెలియజేశారు సీఎం రేవంత్.

►ALSO READ | రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ వశం: బంపర్ మెజార్టీతో క్లీన్ స్వీప్