T20 World Cup: పాకిస్తాన్ వాళ్లకు ఓవర్ అయ్యింది.. మన అభిషేక్ శర్మపై టూమచ్ కామెంట్స్..!

T20 World Cup: పాకిస్తాన్ వాళ్లకు ఓవర్ అయ్యింది.. మన అభిషేక్ శర్మపై టూమచ్ కామెంట్స్..!

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కి ముందు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న టోర్నీకి ముందే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అస్వస్థతతో బాధపడుతున్నప్పటికీ, అతని బ్యాటింగ్ పాక్ జట్టుకు టెన్షన్ కలిగిస్తోంది. పాకిస్తాన్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో అతను ఆడతాడా లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు. మాజీ పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పాకిస్తాన్ కి చెందిన ఓ టీవీ షోలో మాట్లాడిన అమీర్.. అభిషేక్‌ను “స్లాగర్” అంటూ సంభోదించాడు.  

అభిషేక్‌ను ఎలా అదుపులో పెట్టాలో మాకు తెలుసని పాక్ మాజీ క్రికెటర్ అమీర్ పేర్కొన్నారు. “బాడీ లైన్‌లో బౌలింగ్ చేస్తే అతడిని కట్టడి చేయడం కష్టం కాదు.. స్వింగ్ అయ్యే బాల్స్ ను ఎదుర్కొని బౌండరీలు కొడితేనే నేను అతడిని పూర్తి స్థాయి బ్యాటర్‌గా భావిస్తాను అని అన్నాడు. అభిషేక్ కేవలం స్లాగర్ మాత్రమే.. ప్రతి బంతినీ బలంగా ఆడాలని అనుకుంటాడు.. ఒక రోజు సెట్ అయితే భారీ స్కోర్ చేస్తాడు.. విఫలమయ్యే ఛాన్స్ లే ఎక్కువగా ఉన్నాయి.. టెక్నికల్‌గా అతను అంత బలంగా కూడా లేడు అని పాకిస్తాన్ మాజీ ప్లేయర్ తెలిపారు.  

►ALSO READ | T20 World Cup: కెనడాను భయపెడుతున్న యూఏఈ బౌలర్లు.. ఆసక్తికరంగా మరో మ్యాచ్

అమీర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇండియన్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్న అభిషేక్‌పై ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని సూచిస్తున్నారు.  ఇటీవల అమెరికాతో జరిగిన మ్యాచ్ సమయంలో అభిషేక్ శర్మ అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అతను సుమారు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ ఆడటంపై అనుమానాలు రేకెతిస్తున్నాయి.