విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి మాయం అయిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సీఎం చంద్రబాబును కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారామె. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు. న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారాయన.
ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. విజయలక్ష్మితో మాట్లాడి మొత్తం ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు.
►ALSO READ | సాయికృష్ణ లాకప్ డెత్ పై మానవ హక్కుల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు..
ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారామె. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని గాదె విజయలక్ష్మి తెలిపారు.
