ఏపీలో సాయికృష్ణ లాకప్ డెత్ రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సాయికృష్ణ మృతికి సీఐ నాగరాజు, పోలీసులే కారణమంటూ ఆరోపియస్తోంది వైసీపీ. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో సాయికృష్ణ లాకప్ డెత్ పై మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ప్రతిపక్ష వైసీపీ.
సాయికృష్ణ లాకప్ డెత్ తో పాటు క్రాంతికుమార్ ఆత్మహత్యపై కూడా విచారణ జరపాలని కోరింది వైసీపీ. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ కు వినతిపత్రం అనిదించారు వైసీపీ ఎంపలు గురుమూర్తి, తనూజారాణి.
►ALSO READ | గండిపేట భూముల కేసులో బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్.
విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్, లాకప్ డెత్ కు గురైన గాదె సాయికృష్ణ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ రెండు ఘటనలపై తక్షణమే విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్ ను కోరారు.ఈ రెండు ఘటనల వెనక నిజాలను బయటికి తీసి బాద్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని కోరింది వైసీపీ.
