జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ( జూన్ 19)న గ్రహాల ప్రభావం చాలా డైనమిక్ ఉంటుంది.. సూర్యుడు, కుజుడు, చంద్రుడు, గురుడు సంచారాన్ని కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు కలుగుతాయి. ఈ గ్రహాలు ఏ సంచరిస్తున్నాయి.. ఎవరికి ఎలా ఉంటుంది. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
ఈ రోజు ( 2026 జూన్ 19) గ్రహాలు చాలా డైనమిక్ గా సంచరిస్తున్నాయి,, సూర్యుడు, బుధుడు మిథునరాశిలో.. కుజుడు, చంద్రుడు సింహరాశిలో.. గురుడు కర్కాటకరాశిలో సంచరించడం వలన కొన్ని రాశుల వారికి వాక్చాతుర్యం.. వ్యాపారంలో అభివృద్ది..జాబ్ లో లీడర్ షిప్ క్వాలిటీస్ వస్తాయి. మరికొన్ని రాశుల వారికి ఆత్మవిశ్వాసం.. భావోద్వేగాలు పెరుగతాయి. ఈ ఫలితాలు ఈ రోజు నుంచి 45 వరకు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు 12 రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం
మేషరాశి : ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందది. ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులు జాబ్ ప్రయత్నం చేయండి, కుటుంబంలో శాంతి.. సౌఖ్యం ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. . ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది.
వృషభరాశి: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో మార్పులు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఏ పని చేసిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వస్తాయి. భాగస్వామ్య ఒప్పందాలు చేయాలని ఆలోచించేవారు ఈ సమయంలో దూరంగా ఉండటమే మంచిది. కుటుంబసభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశముందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిధునరాశి : సూర్యుడు, బుధుడు, యురేనస్ సంచారం వలన ఈ రాశి వారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా పూర్తి చేస్తారు. చేతి వృత్తుల వారికి ఒక్కసారిగా ఆర్డర్లు రావడంతో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు.
కర్కాటకం : జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం గురువు ఉన్నత స్థితిలో సంచారం వలన ఈ రాశి వారికి కుటుంబం, ఆస్తి విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనేక లాభాలను చూస్తారు. . ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పండితులు చెబుతున్నారు.
సింహరాశి : కుజుడు , చంద్రుడు మీ రాశిలో ప్రవేశం చేయటంతో ఎనర్జీ, నాయకత్వం పెరుగుతాయి. వృత్తి పరంగా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా సుఖ సంతోషాలు నెలకొంటాయి.
కన్యారాశి : ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు తీరుతాయి. అన్నీ రంగాల్లో విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ మీ వెంటే విజయం ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.
తులారాశి : ఈ రాశి వారికి గ్రహాల సంచారం వలన జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడటంతో... గతంలో ఉన్న బాకీల నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి పరంగా పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెడితే మూడు రెట్లు లాభాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు..
వృశ్చికరాశి: ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కొత్త వెంచర్లు ప్రారంభిస్తారు. వ్యాపారవేత్తలకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కృషికి తగిన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి అవార్డులు అందుకుంటారు. ఎప్పటి నుంచో పూర్తి కాలేకపోయిన టాస్కులను ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే ఆశించిన లాభాలు కలుగుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది . ఆరోగ్యం మెరుగు పడుతుంది. .
మకరరాశి : గ్రహాల సంచారం వలన ఈ రాశి వారికి కార్యాలయంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల వలన ఆందోళన కలిగే అవకాశం ఉంది. వాహనం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు ఆలస్యం కావడం.. రావలసిన డబ్బులు చేతికి అందకపోవడం.. ఖర్చులు పెరగడం వలన ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. కావున ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి: ఇదే రాశిలో ఫ్లూటో సంచరించడం వలన సామాజికంగా గుర్తింపు పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశీయానానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది.
మీనరాశి : ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా పూర్తి చేస్తారు. చేతి వృత్తుల వారికి ఒక్కసారిగా ఆర్డర్లు రావడంతో పని ఒత్తిడి పెరుగుతుంది
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
