పవన్ కళ్యాణ్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా బాధ లేదు: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

పవన్ కళ్యాణ్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా బాధ లేదు: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ లో తెలంగాణ జనసేన ఆఫీసు ప్రారంభించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ( జూన్ 19 ) మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన ఆఫీసును ప్రారంభించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా బాధ లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఎవరితో ఏం ప్రాబ్లం ఉందో తమకు సంబంధం లేదని అన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. సామరస్యంగా తెలంగాణకు వస్తే తన ఇంట్లోనే భోజనాలు పెట్టిస్తానని.. రాజకీయాలు చేస్తామంటే కుదరదని అన్నారు మహెష్ కుమార్.

►ALSO READ | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ 

ఏపీలో అధికారం చేపట్టిన జోష్ లో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. తెలంగాణలో పార్టీని బలోపేతం లక్ష్యంగా అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన ఆఫీసును ప్రారంభించారు. శుక్రవారం ( జూన్ 19 ) ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ ఆఫీసును ప్రారంభించారు పవన్ కళ్యాణ్.

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పార్టీ ఆఫీసును ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో జనసేన ఉనికిని చాటుకునేందుకు, క్షేత్రస్థాయిలో క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు తానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఇప్పటికే ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తెలంగాణ క్యాడర్ కు పవన్ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారన్నది ఆసక్తిగా మారింది.