నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం మైసా సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా కోసం డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డారు రష్మిక. తన గాయంపై స్పందిస్తూ సోమవారం ( ఆగస్టు 3 ) ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు రష్మిక. షూటింగ్ లో గాయపడ్డ తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రష్మిక ఇవాళ తన ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ కి అప్ డేట్ ఇచ్చారు. తనకు గాయాలు అసలు నచ్చవని... ఎవరికీ తెలియకూడదు అనుకున్నా కానీ.. ఇప్పుడు చెప్పాల్సి వస్తోందంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు రష్మిక.
తనకు గాయం అవ్వడం వరుసగా ఇది మూడోసారి అని...తన శరీరాన్ని మెషిన్ లాగా కాకుండా జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలని అనుకుంటున్నానని అన్నారు. షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో హిప్ ప్రాంతంలోని నాలుగు టెండన్లలో ఒకటి విడిపోయిందని, అది మళ్లీ కలిసే వరకు కాలు పైకి ఎత్తడం వంటి కదలికలు కష్టమవుతాయని అన్నారు రష్మిక.
Hie guyssss!🥰❤️
— Rashmika Mandanna (@iamRashmika) August 3, 2026
Injuries suck.. 😩 and I was really hoping that no one will get to know.. but well 🐒🤷🏻♀️
Sorry I’ve been MIA 🐒 but hieeee! I’m hereeee!🙋🏻♀️😁
It happened awhile ago ya and this is my 3rd injury back to back.. 🤦🏻♀️
I should definitely learn to treat my body like a… pic.twitter.com/yJj70yEyAE
మైసా సినిమా తన కెరీర్లోనే ఎక్కువ యాక్షన్, ఎనర్జిటిక్ మూవీగా అనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం తనకు నొప్పి ఉన్నప్పటికీ భరించలేనంతగా లేదని, వైద్యుల సూచనలతో రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు రష్మిక. ఈ ఇంజురీ వల్ల వచ్చిన లీజర్ టైంను పజిల్స్ చేస్తూ గడుపుతున్నానని తెలిపారు రష్మిక.
తన హెల్త్ గురించి ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దని.. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ ఇస్తానని తెలిపారు రష్మిక. రష్మిక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
