యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ 

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ( జూన్ 19 ) జరిగిన ఈ కార్యక్రమంలో స్కూళ్ళు, కాలేజీలను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేయించారు సీఎం రేవంత్. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. 119 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను దేశానికే రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతామని అన్నారు.

తెలంగాణ పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడింది కాదని... 60 ఏండ్లు ఉద్యమ బాట పట్టి ఆత్మ బలిదానాలు చేస్తే తెలంగాణ ఏర్పడిందని అన్నారు సీఎం రేవంత్. వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేస్తే తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారంటే అది గొప్ప బావోద్వేగమని..దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని అన్నారు.

►ALSO READ | హైదరాబాద్ లో జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభించిన పవన్ కళ్యాణ్...

బడ్జెట్ లో విద్యకు ఎనిమిదిన్నర శాతం కేటాయించామని... ఈ నిధులు భవిష్యత్ పెట్టుబడిగా భావిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్. విద్య కోసం బడ్జెట్ లో రూ. 26వేల కోట్లు ఖర్చు చేశామని.. రేపటి భవిష్యత్తులో ఆర్థిక పునాదికి విద్యార్థులే ఆధారమని అన్నారు సీఎం రేవంత్. పదేళ్లు బీఆర్ఎస్ విద్యావ్యవస్థను నాశనం చేసిందని.. ఏనాడూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు సీఎం రేవంత్. విద్య ప్రక్షాళన కోసమే విద్యాశాఖను తన దగ్గర ఉంచానని స్పష్టం చేశారు సీఎం రేవంత్.