హైదరాబాద్ లో జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభించిన పవన్ కళ్యాణ్...

హైదరాబాద్ లో జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభించిన పవన్ కళ్యాణ్...

ఏపీలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది.ఏపీలో అధికారం చేపట్టిన జోష్ లో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. తెలంగాణలో పార్టీని బలోపేతం లక్ష్యంగా అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన ఆఫీసును ప్రారంభించారు. శుక్రవారం ( జూన్ 19 ) ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ ఆఫీసును ప్రారంభించారు పవన్ కళ్యాణ్.

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పార్టీ ఆఫీసును ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో జనసేన ఉనికిని చాటుకునేందుకు, క్షేత్రస్థాయిలో క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు తానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఇప్పటికే ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తెలంగాణ క్యాడర్ కు పవన్ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారన్నది ఆసక్తిగా మారింది.

►ALSO READ | ATCల ద్వారా యువతను తీర్చిదిద్దుతున్నాం... జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నాం: మంత్రి వివేక్