హైదరాబాద్ చెరువుల వద్ద ఇండ్లు కోల్పోయిన పేదలకు డబుల్ ఇండ్లు..75 మంది గుర్తింపు

 హైదరాబాద్ చెరువుల వద్ద ఇండ్లు కోల్పోయిన పేదలకు డబుల్ ఇండ్లు..75 మంది గుర్తింపు
  • కలెక్టర్లతో హైడ్రా కమిషనర్ చర్చలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల ఆక్రమణల తొలగింపులో భాగంగా ఇండ్లు కోల్పోయిన పేద కుటుంబాలకు డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇప్పించేందుకు హైడ్రా కృషి చేస్తోంది. ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతల్లో నివాసాలు కోల్పోయిన కుటుంబాల్లో నిజంగా నిరుపేదలైన 75 మందిని గుర్తించింది. 

వీరికి ఇండ్లు ఇప్పించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చర్చలు జరుపుతున్నారు. చెరువుల వద్ద హైడ్రా కూల్చివేతలు జరిపిన సమయంలో అక్కడ గుడిసెలు వేసుకొని ఉండి, ఎటువంటి నివాసం లేని వారినే పరిగణలోకి తీసుకుంటున్నారు.