హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో గురువారం రాత్రి ఉన్నట్టుండి వర్షం దంచికొట్టింది. సాయంత్రం వరకూ కూడా మాములుగానే ఉన్న వాతావరణం రాత్రి 8 గంటల తర్వాత పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది.
చిరు జల్లులు కాస్తా భారీ వర్షంగా మారింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, SR నగర్, అమీర్ పేట్ పరిసరాల్లో వర్షం కుండపోతగా కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. IDPL, చింతల్, షాపూర్ నగర్, సూరారం, బహుదూర్ పల్లి, జీడిమెట్ల, గాజులరామారంలో భారీ వర్షం కురుస్తుండటంతో ఫుల్ ట్రాఫిక్ జాం అయింది. రాత్రి 8.30 నుంచి 10.30 గంటల మధ్యలో గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాంగూడ, శేరిలింగం పల్లి ఏరియాల్లో కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
