నిరుద్యోగులపై అక్రమ కేసులు, అరెస్టులా?..19 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్

నిరుద్యోగులపై  అక్రమ కేసులు, అరెస్టులా?..19 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్




పంజాగుట్ట, వెలుగు. నిరుద్యోగులపై అక్రమ కేసులు పెట్టడం, వారిని అరెస్ట్​చేయడం అన్యాయమని మాజీ అసిస్టెంట్ ​ప్రొఫెసర్​ ప్రసన్న హరికృష్ణ అన్నారు. 19 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని,  నిరుద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ ​చేస్తూ గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిరుద్యోగ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వానికి, అధికారులకు స్పష్టత లేదని ఆరోపించారు. కాంగ్రెస్​కు పట్టం కట్టిన నిరుద్యోగుల చేతులకే నేడు బేడీలు వేస్తున్నారని.. అవే చేతులు ఓట్ల రూపంలో గద్దె దించుతాయని హెచ్చరించారు. జర్నలిస్ట్​ విఠల్, నిరుద్యోగులు పాల్గొన్నారు.