మాల ఉద్యమకారులను ఆదుకోండి..మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ పిల్లి సుధాకర్ డిమాండ్

మాల ఉద్యమకారులను ఆదుకోండి..మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ పిల్లి సుధాకర్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన మాలలను ఆదుకోవాలని మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్యమకారుల కమిటీ మెంబర్లు ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలుస్తామని ఆయన తెలిపారు. గురువారం నాంపల్లి టీజేఎస్ ఆఫీసులో మాల మహానాడు రాష్ర్ట సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాలల వివరాలను సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తామని పిల్లి సుధాకర్ చెప్పారు.

అనంతరం మాల ఉద్యమకారులతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఉద్యమకారులను గుర్తించడానికి రాష్ట్రంలో మాల తెలంగాణ ఉద్యమకారుల కో ఆర్డినేషన్ కమిటీని  ఏర్పాటు చేశామని వివరించారు. సమన్వయ కర్తగా  పిల్లి సుధాకర్, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా బైరి రమేశ్, దార సత్యం, కనకరాజు, గోలి సైదులు, అసాది పురుషోత్తంను నియమించారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారి వివరాలను ఈ నెలలో సేకరిస్తామని వెల్లడించారు.