SBIలో 1500 ఖాళీ పోస్టులు.. మినిమమ్ డిగ్రీ పాసైన చాలు.. ఆర్హతలు ఇవే..

 SBIలో 1500  ఖాళీ పోస్టులు.. మినిమమ్ డిగ్రీ పాసైన చాలు.. ఆర్హతలు ఇవే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఆన్‌‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 18న ప్రారంభమై జులై 8న ముగుస్తుంది. 

పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ). 

మొత్తం ఖాళీలు: 1500. 

విభాగాల వారీగా ఖాళీలు: అన్ రిజర్వ్డ్ 588, ఈడబ్ల్యూఎస్ 144, ఓబీసీ 390, ఎస్సీ 234 (రెగ్యులర్ 216, బ్యాక్​లాగ్ 18), ఎస్టీ 144  (రెగ్యులర్ 108, బ్యాక్​లాగ్ 36).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఈ ఎగ్జామ్  రాయడానికి ఎస్బీఐ కేటగిరీల వారీగా గరిష్ట పరిమితి విధించింది. అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ ఆరు సార్లు, పీడబ్ల్యూబీడీలకు తొమ్మిది సార్లు, ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి గరిష్ట పరిమితులు లేదు. 

వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 18.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: జులై 8. 

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: 2026, ఆగస్టు. 

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్: 2026, ఆగస్టు/ సెప్టెంబర్.

మెయిన్ ఎగ్జామినేషన్: 2026, సెప్టెంబర్

మెయిన్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్: 2026, సెప్టెంబర్/ అక్టోబర్.

సైకోమెట్రిక్, గ్రూప్ ఎక్సర్​సైజ్​  & ఇంటర్వ్యూ: 2026, అక్టోబర్/ నవంబర్. 

ఫైనల్ రిజల్ట్స్: 2026, నవంంబర్/ డిసెంబర్. 

సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్​సైజ్ & ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్  ibpsreg.ibps.in/sbipojun26ను సందర్శించండి. 

సెలెక్షన్ ప్రాసెస్
ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 మార్కులకు ఆన్‌‌లైన్ పద్ధతిలో జరిగే అబ్జెక్టివ్ పరీక్ష. దీనిని 1 గంటలో పూర్తి చేయాలి. ఇందులో ఉండే మూడు సెక్షన్లకు విడివిడిగా సమయం కేటాయిస్తారు. ప్రిలిమ్స్​లో సెక్షన్ల వారీగా ఎలాంటి కటాఫ్ మార్కులు ఉండవు. అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ప్రతి కేటగిరీలో ఉన్న ఖాళీలకు దాదాపు 10 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్‌‌కు ఎంపిక చేస్తారు.

సెక్షన్–Iలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, సెక్షన్-–IIలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, సెక్షన్–IIIలో రీజనింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలు 30 మార్కులకు ఇస్తారు.  నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. 

మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్
మెయిన్ ఎగ్జామ్ ఆన్‌‌లైన్ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో 200 మార్కులకు అబ్జెక్టివ్ పరీక్ష, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి మొత్తం 3 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. అబ్జెక్టివ్ పరీక్ష ముగిసిన వెంటనే డిస్క్రిప్టివ్ పరీక్ష మొదలవుతుంది. అభ్యర్థులు తమ సమాధానాలను నేరుగా కంప్యూటర్‌‌లోనే టైప్ చేయాల్సి ఉంటుంది.

రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలు 60 మార్కులకు (50 నిమిషాలు), డేటా అనాలసిస్ & ఇంటర్ ప్రిటేషన్ 30 ప్రశ్నలు 60 మార్కులకు (45 నిమిషాలు), జనరల్ అవేర్​నెస్/ ఎకానమీ/ బ్యాకింగ్ నాలెడ్జ్ 60 ప్రశ్నలు 60 మార్కులకు (45 నిమిషాలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు, 20 మార్కులకు (40 నిమిషాలు)ల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత వెంటనే నిర్వహించే డిస్క్రిప్టివ్ టెస్టులో 3 ప్రశ్నలు ఇస్తారు. 30 మార్కులు కేటాయించారు. 30 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.  

అభ్యర్థులు డిస్క్రిప్టివ్ పేపర్‌‌తో సహా ప్రతి సెక్షన్‌‌లోనూ బ్యాంక్ నిర్ణయించిన సెక్షనల్ కటాఫ్ సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ మొత్తంలో వచ్చిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆబ్జెక్టివ్ వరకు నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. 

మూడో దశ: సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ ఎక్సర్ సైజ్ & ఇంటర్వ్యూ
ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత 20 మార్కులకు గ్రూప్ ఎక్సర్‌‌సైజ్, 30 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ విడత మొత్తం 50 మార్కులకు జరుగుతుంది. ఈ పరీక్షలోని ప్రశ్నలన్నింటికీ తప్పనిసరిగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

తుది ఎంపిక 
తుది మెరిట్ జాబితాను రూపొందించే ముందు ఫేజ్–-2 (అబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ మార్కులు), ఫేజ్–-3 (గ్రూప్ ఎక్సర్‌‌సైజ్, ఇంటర్వ్యూ మార్కులు) మార్కులను విడివిడిగా మొత్తం 100 మార్కులకు నార్మలైజ్ చేస్తారు. ఆ తర్వాతే ఈ రెండింటినీ కలుపుతారు. ఈ దశలో ప్రిలిమినరీ ఎగ్జామ్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.