కారంపూడి SI వేధింపులతో పురుగుల మందు తాగిన మహిళ

కారంపూడి SI వేధింపులతో పురుగుల మందు తాగిన మహిళ

పల్నాడు జిల్లాలోని కారంపూడి ఎస్ఐ వేధింపులతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల ప్రకారం.. ఆర్ధిక లావాదేవిల విషయంలో గాదేవారిపల్లె‎కు చెందిన ఓ వ్యక్తిని కారంపూడి ఎస్ఐ అదుపులోకి తీసుకుని నాలుగు రోజుల పాటు స్టేషన్‎లో చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

సదరు వ్యక్తి భార్య కోర్టును ఆశ్రయించడంతో వదిలిపెట్టాడు. ఈ క్రమంలో మరోసారి భార్యభర్తలు ఇద్దరిని ఎస్ఐ స్టేషన్‎కు పిలిపించాడు. అందరి ముందు భర్తతో పాటు భార్యను ఎస్ఐ కొట్టినట్లు సమాచారం. గంజాయి కేసు పెట్టి భార్యభర్తలు ఇద్దరిని లోపల వేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు తెలిసింది. 

►ALSO READ | ఉరవకొండలో హై టెన్షన్.. వైసీపీ కీలక నేతలు మాధవ్, విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్..

దీంతో మనస్తాపానికి గురైన సదరు మహిళా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఐ వల్ల తమకు ప్రాణహాని ఉందని.. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం అధికారులను వేడుకుంది.