ఉరవకొండలో హై టెన్షన్.. వైసీపీ కీలక నేతలు మాధవ్, విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్..!

ఉరవకొండలో హై టెన్షన్.. వైసీపీ కీలక నేతలు మాధవ్, విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్..!

అనంతపురం జిల్లా ఉరవకొండలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా ధర్నాకు పిలుపునిచ్చిన వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరవకొండ వైఎస్సార్సీపీ కార్యాలయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. 

దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. మరోవైపు.. విశ్వేశ్వర రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు ఉరవకొండ బయలుదేరిన మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్‎ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పెనుకొండలో మాజీ మంత్రి శంకర నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. గుంతకల్ సబ్ డివిజన్‌లో పోలీస్ యాక్ట్-30 అమలు ఉందని.. ఉరవకొండలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. 

►ALSO READ | శ్రీకాళహస్తిలో హత్యాయత్నం.. స్వర్ణముఖి నది తీరంలో యువకుడిపై కత్తులతో దాడి

ఏదేమైనా ధర్నా నిర్వహించి తీరుతామంటూ విశ్వేశ్వర్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. టీడీపీ, వైసీపీ పోటాపోటీ నిరసనలతో ఉరవకొండ అట్టుడుకుతోంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉరవకొండలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.