శ్రీకాళహస్తిలో హత్యాయత్నం.. స్వర్ణముఖి నది తీరంలో యువకుడిపై కత్తులతో దాడి

శ్రీకాళహస్తిలో హత్యాయత్నం.. స్వర్ణముఖి నది తీరంలో యువకుడిపై కత్తులతో దాడి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. స్థానిక స్వర్ణముఖి నది తీరంలో కొండమిట్టకు చెందిన శివ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చేలోపే దాడికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులు పారిపోయినట్టు వన్ టౌన్ సీఐ తెలిపారు.

బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. బాధితుడు శివ స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడని.. బైక్లు ఇతర వాహనాలు కుదవ పెట్టుకొని వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడని తెలిపారు. వ్యాపార లావాదేవీల వ్యవహారంలో తేడాలు వచ్చి హత్య ప్రయత్నం జరిగిందా లేదా దాడికి మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యా్ప్తు చేస్తున్నట్లు చెప్పారు.

►ALSO READ | ఫ్రెండ్షిప్ డే రోజున విషాదం... విశాఖ బీచ్ లో ఇద్దరు గల్లంతు..