ట్రిపుల్ రైడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్రాఫిక్ పోలీసుల కొరడా..మల్కాజిగిరిలో ఒకేరోజు 682 కేసులు.. రూ.8.16 లక్షల జరిమానా

ట్రిపుల్ రైడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్రాఫిక్ పోలీసుల కొరడా..మల్కాజిగిరిలో ఒకేరోజు 682 కేసులు.. రూ.8.16 లక్షల జరిమానా

పద్మారావునగర్, వెలుగు: రోడ్డు భద్రతను గాలికొదిలేసి బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై ట్రిపుల్ రైడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న వాహనదారులపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. పోలీస్ కమిషనర్​సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ జోన్​-1, 2 పరిధిలో చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏకంగా 682 కేసులు నమోదు చేసి, రూ.8.16 లక్షల జరిమానా విధించారు.

 ట్రాఫిక్ డీసీపీ –1, 2 పర్యవేక్షణలో ఏసీపీలు, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు, ఎస్సైలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. బైక్​లపై ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. వాహనాల తయారీదారులు నిర్దేశించిన సీటింగ్ సామర్థ్యాన్ని మాత్రమే పాటించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల మేరకే నడుచుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతను కాపాడటం కోసం రాబోయే రోజుల్లోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.