కుప్పకూలిన గోల్డ్ అండ్ సిల్వర్.. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.3వేల 650 తగ్గింది

కుప్పకూలిన గోల్డ్ అండ్ సిల్వర్.. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.3వేల 650 తగ్గింది

గడచిన రెండు రోజులుగా స్పాట్ మార్కెట్లో తగ్గుతున్న బులియన్ ధరలు ఎట్టకేలకు రిటైల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. శాంతి ఒప్పందంపై పెరుగుతున్న నమ్మకంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో శుక్రవారం రోజున ఒక్కసారిగా ధరలు భారీగా పతనం కావటంతో ఆభరణాలు షాపింగ్ చేద్దాం అనుకుంటున్న తెలుగు ప్రజలు ముందుగా తమ నగరాల్లో తగ్గిన రేట్లను పరిశీలించటం బెటర్. 

జూన్ 19న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 18 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.365 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 586గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 370గా కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 19, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.