పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: పోలీసు అమరవీరుల స్మారక పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి

పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: పోలీసు అమరవీరుల స్మారక పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి

గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో జరుగుతున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి.. పోలీసు అమరవీరులకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వినమ్ర నివాళులు అర్పించారు. 

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో పోలీసు అమరవీరుల స్మారక పరేడ్కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల సేవలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసులకు జోహార్లు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమంటూ సందేశమిచ్చారు.