గౌతమి ఆస్తుల కేసులో ఈడీ ఎంట్రీ.. 6 చోట్ల మెరుపు దాడులు!

గౌతమి ఆస్తుల కేసులో ఈడీ ఎంట్రీ.. 6 చోట్ల మెరుపు దాడులు!

సినిమా స్క్రీన్లపైనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఊహించని ట్విస్టులతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు గౌతమిని నమ్మించి మోసం చేసిన హై-ప్రొఫైల్ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎంట్రీ ఇచ్చింది. ఈ మనీ ఫ్రాడ్ వెనుక అంతర్జాతీయ లింకులు, మనీలాండరింగ్ నెట్‌వర్క్ ఉన్నట్లు తేలడంతో ఈడీ అధికారులు బుధవారం చెన్నై, మదురై నగరాల్లోని 6 చోట్ల ఏకకాలంలో రైడ్స్ నిర్వహించి ప్రకంపనలు సృష్టించారు.

నమ్మకానికి వెన్నుపోటుకు ..

అసలు కథేంటంటే.. సినిమా ప్రొడ్యూసర్ సి. అళగప్పన్ ను గౌతమి తన ఆప్తమిత్రుడిగా, ఆస్తి సంరక్షకుడిగా ప్రాణంకన్నా ఎక్కువగా నమ్మారు. తన భూములు, ఆస్తుల లావాదేవీలు చూసుకోవడానికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. కానీ ఆ నమ్మకాన్ని ఆయన పెట్టుబడిగా మార్చుకున్నారు. గౌతమికి తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో తిరువళ్లూరు, తిరువణ్ణామలై, రామనాథపురం, చెన్నైలలోని కోట్ల విలువైన ల్యాండ్స్‌ను తన భార్యాపిల్లల పేర్లపై మార్చేసుకున్నారు. ఏకంగా రూ.13.8 కోట్ల భారీ ఫ్రాడ్‌కు తెరలేపడమే కాకుండా, ఆమె బ్యాంక్ అకౌంట్ల నుండి కూడా భారీగా నిధులను మళ్లించారు..

కోర్టు సీరియస్.. సీన్‌లోకి ఈడీ..

ఈ దగాపై గౌతమి న్యాయ పోరాటానికి దిగారు. తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అళగప్పన్ పై 7 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. దీంతో ఆయనపై లూకౌట్ నోటీసులు జారీ చేసింది.  ముందస్తు బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అవ్వడంతో  2023లో అళగప్పన్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే, ఈ నల్లధనాన్ని విదేశీ పెట్టుబడులుగా (PMLA చట్టం కింద) మారిందనే బలమైన అనుమానంతో ఈడీ రంగంలోకి దిగింది.  లేటెస్ట్ గా గౌతమి స్వయంగా ఈడీ కార్యాలయానికి హాజరై కీలక సాక్ష్యాలను సైతం అందజేశారు.

ALSO READ : గుండె పగిలే ఎమోషన్.. మైండ్ బ్లాక్ చేసే యాక్షన్..

ఈ కేసు నడుస్తుండగానే గౌతమి లైఫ్‌లో పొలిటికల్ హై-డ్రామా నడిచింది. 2023లో బీజేపీకి గుడ్‌బై చెప్పిన ఆమె AIADMKలో చేరారు. అక్కడ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన గౌతమి.. ఊహించని విధంగా ఇటీవల ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. మొత్తానికి ఈ ట్విస్టుల పరంపర చూస్తుంటే.. మోసగాళ్ల గుండెల్లో ఈడీ గంటలు గట్టిగానే మ్రోగిస్తోందని అర్థమవుతోంది..