గుండె పగిలే ఎమోషన్.. మైండ్ బ్లాక్ చేసే యాక్షన్.. 'స్పైడర్-మెన్: బ్రాండ్ న్యూ డే' క్రేజీ ట్రైలర్ రిలీజ్!

గుండె పగిలే ఎమోషన్.. మైండ్ బ్లాక్ చేసే యాక్షన్.. 'స్పైడర్-మెన్: బ్రాండ్ న్యూ డే' క్రేజీ ట్రైలర్ రిలీజ్!

మార్వెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. 'స్పైడర్-మెన్: నో వే హోమ్' బ్లాక్‌బస్టర్ తర్వాత టామ్ హాలండ్ మరో సారి పీటర్ పార్కర్‌గా కనిపించగా రెడీ అయిపోయాడు.  ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పైడర్-మెన్: బ్రాండ్ న్యూ డే' ( Spider-Man: Brand New Day) కొత్త ట్రైలర్ వచ్చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ట్రెండింగ్ లో నిలిచింది. మార్చిలో వచ్చిన ఫస్ట్ ట్రైలర్ ఏకంగా 71.8 కోట్ల (718.6 Million) వ్యూస్‌తో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రైలర్ అంతకు మించి అనేలా ఉంది..

కథేంటంటే..

డాక్టర్ స్ట్రేంజ్ వేసిన మంత్రంతో ప్రపంచమంతా పీటర్‌ను మర్చిపోయి సరిగ్గా నాలుగేళ్లు అవుతోంది. ఒంటరిగా, నడిరోడ్డుపై మిగిలిపోయిన పీటర్.. తన బాధను మర్చిపోవడానికి 24 గంటలూ స్పైడర్-మెన్‌గా సిటీని కాపాడటమే పనిగా పెట్టుకుంటాడు. అయితే, మితిమీరిన శ్రమ వల్ల పీటర్ శక్తుల్లో ఊహించని మార్పులు (Mutations) మొదలవుతాయి. అతని శరీరం, మనస్సు అతని కంట్రోల్ తప్పుతాయి. మరోవైపు, తను ప్రాణంగా ప్రేమించిన ఎంజె (Zendaya) జీవితంలో ముందుకు సాగిపోతూ, వేరే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉండటం పీటర్‌ను మానసికంగా క్రుంగదీస్తుంది. ఈ ఎమోషనల్ పెయిన్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు కన్నీళ్లు తెప్పించేలా ఉంది.

హల్క్ వర్సెస్ స్పైడర్-మెన్.. 

ఈ సినిమాకు అసలైన హైలైట్.. మార్క్ రుఫాలో (Bruce Banner/Hulk) ఎంట్రీ. తనలో జరుగుతున్న భయంకరమైన మ్యుటేషన్లను ఎలా ఆపాలో తెలియక పీటర్.. బ్రూస్ బ్యానర్‌ను సాయం అడుగుతాడు. కానీ, సీన్ కట్ చేస్తే.. న్యూయార్క్ స్కైస్క్రాపర్స్ ముక్కలైపోతుండగా, ఇంక్రెడిబుల్ హల్క్‌తో స్పైడర్-మెన్ చేసే ఊరమాస్ ఫైటింగ్ సీక్వెన్స్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.

క్రేజీ యాక్షన్ 

డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో 'ది పనిషర్'గా జాన్ బెర్న్థల్, 'స్కార్పియన్'గా మైఖేల్ మాండో విలనిజం పీక్స్‌లో ఉండబోతోంది. అలాగే సాడీ సింక్, ట్రామెల్ టిల్మన్ కొత్త పాత్రల్లో మెరవనున్నారు. ట్రైలర్ ఎండ్‌లో స్వాట్ (SWAT) ఆఫీసర్లు తనని చుట్టుముడితే.. నేనేం హైస్కూల్ పిల్లోడిని కాదు.. మీరు ఎప్పుడైనా స్ట్రెచింగ్ చేస్తారా? ఒంటికి చాలా మంచిది అంటూ పీటర్ వేసే డైలాగ్, ఆ తర్వాత చేసే ఫైట్ నెక్స్ట్ లెవెల్.

ఈ చిత్రానికి క్రిస్ మెక్‌కెన్నా, ఎరిక్ సోమర్స్ స్క్రిప్ట్ అందించగా.. కెవిన్ ఫైగీ, అమీ పాస్కల్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  భారీ అంచనాల మధ్య జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ మైండ్ బ్లోయింగ్ సూపర్ హీరో యాక్షన్ డ్రామా థియేటర్లలోకి దూసుకురాబోతోంది. బాక్సాఫీస్ రికార్డులన్నీ స్పైడర్ వెబ్‌లో చిక్కుకోవాల్సిందే అంటూ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.