హైదరాబాద్, వెలుగు: 2026 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక కోసం అర్హులైన టీచర్లు జులై 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, హెడ్మాస్టర్లు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
ఆసక్తి ఉన్న టీచర్లు http://nationalawardstoteachers.education.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపిక మార్గదర్శకాలు, పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని కోరారు.
