ముషీరాబాద్, వెలుగు: వైద్యారోగ్య శాఖలో ఎంపికైన 2,032 మంది నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్లు గురువారం బోలక్‌పూర్‌లోని ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వారికి కృష్ణయ్య సంఘీభావం తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖలో ఎంపికైన వారిలో ఇతర శాఖలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులకు చెందిన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చారని, కానీ ఈఎస్ఐ ఆస్పత్రులకు కేటాయించిన నర్సింగ్ ఆఫీసర్లకు మాత్రం ఇప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. పోస్టింగ్ ఎక్కడ వస్తుందో తెలియక అభ్యర్థులు తమ పిల్లలను స్కూళ్లలో కూడా చేర్పించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై సీఎం రేవంత్రెడ్డి, ఈఎస్ఐ అధికారులు వెంటనే
స్పందించాలని కోరారు.
