విక్టరీ వెంకటేష్ ఫుల్ జోష్ లో ఉన్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒకేరోజు రెండు భారీ ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేశారు వెంకీ మామ. ఒకవైపు మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సరికొత్త చిత్రం గ్రాండ్‌గా లాంచ్ చేశారు. మరోవైపు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబో మూవీపై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.
వెంకీ-త్రివిక్రమ్ 'AK47' వచ్చేస్తోంది..
'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి క్లాసిక్ సినిమాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ అంటేనే ఒక వైబ్. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47' (AK47) పై ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే, ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ నిర్మాత నాగవంశీ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2, 2026న గాంధీ జయంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
►ALSO READ | గుండె పగిలే ఎమోషన్.. మైండ్ బ్లాక్ చేసే యాక్షన్.. 'స్పైడర్-మెన్: బ్రాండ్ న్యూ డే' క్రేజీ ట్రైలర్ రిలీజ్!
ఈ చిత్రంలో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ వంటి భారీ తారాగణం నటిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకీ మార్క్ కామెడీ, త్రివిక్రమ్ మార్క్ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమా థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..
అనిల్ తో క్రేజీ ఫ్యామిలీ, క్రైమ్ థ్రిల్లర్
మరోవైపు, వెంకటేష్ - అనిల్ రావిపూడిల హ్యాట్రిక్ మూవీ ఈరోజు అత్యంత వైభవంగా ముహూర్తపు వేడుక జరుపుకుంది. 'F2', 'F3' చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ కాంబో.. ఈసారి అంతకుమించిన క్రేజీ ఫ్యామిలీ, క్రైమ్ థ్రిల్లర్ కథతో రాబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతోనే సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ మూవీలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూట్ షురూ కానుంది.
ఒకే రోజున ఒక సినిమా ఓపెనింగ్, మరో క్రేజీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ రావడంతో వెంకీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. మొత్తానికి 2026లో విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వన్-మ్యాన్ షో చూపించడానికి రెడీ అయిపోయారు..
