హైదరాబాద్: జూన్ 30న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మధిరలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.
రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి సంవత్సరానికి రూ.12వేల చొప్పున, యాసంగి సీజన్‌కు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
మొదటి విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరం వరకు పెట్టుబడి సాయం అందించారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల 11 వేల 947 మంది రైతులకు సాయం అందింది. దాదాపు రూ.5,653 కోట్లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా, విడతల వారీగా అందరికీ సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే.
►ALSO READ | Weather News : రైతులకు గుడ్ న్యూస్..జూన్ 23 నుంచి రాష్ట్రంలో వర్షాలు.. బాగా తగ్గనున్న ఎండలు
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, పంటల సాగుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడంలో రైతు భరోసా కీలక పాత్ర పోషిస్తుంది.
