తెలంగాణ రైతులకు, ప్రజలకు గుడ్ న్యూస్.. జూన్ 23 నుంచి రాష్ట్రంలో నైరుతిరుతు పవనాలు పుంజుకోనున్నాయి. రుతుపవనాలతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. వర్షాకాలం ప్రారంభమై వర్షాలకోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఇది శుభవార్త.. అలాగే తీవ్రమైన ఎండవేడిమి, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు కూడా ఉపశమనం లభించనుంది.
జూన్ 23 నుంచి నైరుతి రుతుపవనాలు పుంజుకుంటాయని, విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎంబీ అంచాన వేసింది. ఉరుములుతో మెరుపులతో వర్షాలు, తేమతో కూడిన గాలులు రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా కొనసాగుతున్న వేడిమి నుంచి రిలీఫ్ దొరకనుంది.
ఐఎండీ తాజా బులెటిన్ల ప్రకారం జూన్ 23(మంగళవారం) నుంచి తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయని న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్‌గఢ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పంట సాగుకోసం ఎదురుచూస్తున్న రైతులకు నైరుతి రుతుపవనాల రాకతో పెద్ద ఊరట లభించనుంది.
అంతకుముందు అంటే.. జూన్ 17 నుంచి20 మధ్య తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డి స్పష్టం చేసింది. ఆ తర్వాత జూన్ 21 నుండి తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు) వీస్తాయని అంచనా వేసింది.
