FIFA World Cup: దుమ్ము లేపిన మెక్సికో.. 2026లో నాకౌట్ చేరుకున్న ఫస్ట్ జట్టుగా రికార్డు

FIFA World Cup: దుమ్ము లేపిన మెక్సికో.. 2026లో నాకౌట్ చేరుకున్న ఫస్ట్ జట్టుగా రికార్డు

ఫిఫా వరల్డ్ కప్ 2026 హోరాహోరీగా సాగుతోంది. గురువారం (జూన్ 18) జరిగిన మ్యాచ్ లో దక్షణి కొరియాను ఓడించి నాకౌట్ చేరుకుంది మెక్సికో. సౌత్ కొరియా చేసిన డిఫెన్సివ్ లోపాన్ని వినియోగించుకుని  మెక్సికో 1-0 తేడాతో గెలిచింది. దీంతో 2026లో నాకౌట్ చేరిన తొలి టీమ్ గా రికార్డులోకెక్కింది. 2022లో గ్రూప్ స్టేజ్ ను కూడా దాటలేకపోయిన మెక్సికోకు.. ఇది ఒక గొప్ప విజయం అనే చెప్పవచ్చు. 

సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో 50వ నిమిషంలో లూయిస్ రోమో గోల్ చేయడంతో గెలపును అందుకుంది. దక్షిణ కొరియా గోల్ కీపర్ కిమ్ సియోంగ్-గ్యు, డిఫెండర్ లీ గి-హ్యూక్‌ ల మధ్య బాల్ ఇన్ సైడ్ ఏరియాలో డ్రాప్ అయింది. ఆ బంతిని అందుకున్న లూయిస్ రోమో, సులభంగా ఖాళీ నెట్‌లోకి పంపాడు.

గ్రూప్ ఎలో జరిగిన రెండు మ్యాచ్‌ల నుంచి మెక్సికో ఆరు పాయింట్లు సాధించింది. ఇది దక్షిణ కొరియా కన్నా మూడు పాయింట్లు ఎక్కువ. అదేవిధంగా అట్లాంటాలో 1-1తో డ్రా చేసుకున్న చెక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికా కన్నా ఐదు పాయింట్లు ఎక్కువ. దీంతో నాకౌట్ చేరుకోవడం ఈజీ అయ్యింది మెక్సికోకు

ప్రతి గ్రూపు నుంచి టాప్ లో నిలిచిన రెండు జట్లు, మూడో స్థానంలో ఉన్న బెస్ట్ ఎనిమిది టీమ్స్ నాకౌట్ దశకు చేరుకుంటాయి. టోర్నమెంట్‌ను 48 జట్లకు పెంచిన తర్వాత, ఫిఫా వరల్డ్ కప్ లో తొలిసారిగా రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు జరుగుతున్నాయి.