బడిని బతికించేందుకు టీచర్ల పోరాటం..సొంత నిధులతో షెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసిన టీచర్ల పోరాటం

బడిని బతికించేందుకు టీచర్ల పోరాటం..సొంత నిధులతో షెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసిన టీచర్ల పోరాటం
  •      సూర్యాపేట హరిజనవాడలో శిథిలావస్థకు చేరిన స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     భయంతో బడికి రాని పిల్లలు
  •     సొంత నిధులతో షెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసిన టీచర్లు

సూర్యాపేట, వెలుగు : అద్దె గదిలో కొనసాగుతున్న స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిథిలావస్థకు చేరుకోవడంతో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావాలంటేనే చిన్నారులు భయపడుతున్నారు. దీంతో చిన్నారులను స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రప్పించేందుకు టీచర్లు ముందుకొచ్చారు. సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నిధులు రాకపోవడంతో టీచర్లే సొంత డబ్బుల ఖర్చు చేసి ఓ షెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి పాఠాలు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో స్థానికంగా అద్దె భవనంలోనే తరగతులు కొనసాగించారు. 35 మంది స్టూడెంట్లు ఉన్న ఈ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు గదులు మాత్రమే ఉండగా.. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పు నుంచి వర్షపు నీరు పడుతుండడంతో తరగతుల నిర్వహణ కష్టంగా మారింది.

దీంతో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో పాటు కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడంతో స్టూడెంట్లు స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావడం మానేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సరిపోకపోవడంతో టీచర్లే సొంత నిధులతో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవరణలో ఓ షెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వేశారు. అక్కడే బెంచీలు ఏర్పాటు చేసి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. అయితే సరైన తరగతి గదులు, ఆటస్థలం, వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారని టీచర్లు అంటున్నారు. హరిజనవాడ ఏరియాలో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. కొత్త భవనం నిర్మిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.