- ‘గ్రీన్ ఇండియా -సేవ్ ఎనర్జీ ..పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన గ్రీన్ ఇండియా – సేవ్ ఎనర్జీ, వాటర్ అండ్ ఫ్యూయల్ దేశవ్యాప్త అవగాహన పోస్టర్‌ను గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం ఆవిష్కరించారు.
ఇగ్నైటింగ్ మైండ్స్ మిషన్, దివ్య ప్రేమ్ సేవా మిషన్, ఇండియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నెట్‌వర్క్ సంయుక్తంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. గవర్నర్ మాట్లాడుతూ.. సహజ వనరులను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. నిర్వాహక సంస్థల ప్రతినిధి మంకెన శ్రీనివాస్ రెడ్డి, ఐనవోలు మురళీధర్ రెడ్డి, ఆర్.వి.ఆర్. ప్రసాద్, ఎం. విజయ్ భాస్కర్ రెడ్డి, పుతోట లూయిస్ అరుల్ తదితరులు పాల్గొన్నారు.
