టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ఊరమాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల... 'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తోందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise) ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో మామూలు క్రేజ్ లేదు. ఈ మూవీ రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదాపడటంతో ఫ్యాన్స్ లో నిరాశ నెలకొంది. అయితే , లేటెస్ట్ గా వచ్చిన క్రేజీ అప్డేట్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
విక్రమ్ మాలిక్ ఎంట్రీ..
రిలీజ్ వాయిదా పడినా.. సినిమాపై హైప్ పెంచేలా చిత్ర బృందం సరికొత్త పాత్రను పరిచయం చేసింది. ఈ చిత్రంలో నాని ‘జడల్’ అనే ఊరమాస్ పాత్రలో నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘సికంజా మాలిక్’ అనే ఒక పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా చిత్రబృందం ఈ సినిమాలోని మరో కీలకమైన విలన్ పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.
►ALSO READ | ట్విస్టులు, గుండెల్ని పిండేసే ట్రాజెడీలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయోపిక్‌తో వస్తున్న అమీర్ ఖాన్!
బాలీవుడ్ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ ఇందులో మోహన్ బాబు కొడుకు ‘విక్రమ్ మాలిక్’ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. మెడలో కిలోల కొద్దీ బంగారు నగలు, చేతిలో గన్, డిఫరెంట్ హెయిర్ స్టైల్, కళ్లలో క్రూరత్వంతో రాఘవ్ జుయల్ లుక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
'ప్యారడైజ్' మళ్లీ వాయిదా?
సినిమా అప్‌డేట్ అయితే క్రేజీగా ఉంది కానీ, రిలీజ్ డేట్ విషయంలోనే ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ తగిలింది. మొదట ఈ ఏడాది మార్చిలోనే రావాల్సిన ఈ చిత్రం, ఆ తర్వాత ఆగస్టు 21న వస్తుందని ప్రకటించారు. కానీ, తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ ఎక్కడా రిలీజ్ డేట్ ప్రస్తావించలేదు. దీనితో సినిమా వాయిదా పడటం పక్కా అని తేలిపోయింది.
భారీ యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాఫిక్స్ పనుల వల్లే ఈ ఆలస్యం జరుగుతున్నట్లు టాక్. మరి ఈ 'ప్యారడైజ్' వేట డిసెంబర్ రేస్‌లోకి వస్తుందా? లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే. కాస్త లేటైనా.. థియేటర్లలో నాని సరికొత్త రికార్డుల వేట సాగించడం ఖాయం అనిపిస్తోంది.
