ఇంటర్ తర్వాత చదువు మానేయండి.. డిగ్రీలున్నా మీ కంటే వాళ్ల సంపాదనే ఎక్కువ..! మిడిల్ క్లాస్కు సౌరభ్ ముఖర్జియా సూచనలు

ఇంటర్ తర్వాత చదువు మానేయండి.. డిగ్రీలున్నా మీ కంటే వాళ్ల సంపాదనే ఎక్కువ..! మిడిల్ క్లాస్కు సౌరభ్ ముఖర్జియా సూచనలు

ప్రముఖ ఇన్వెస్టర్, మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ సీఈఓ సౌరభ్ ముఖర్జియీ బాంబు పేల్చారు. చదువు విషయంలో భారత్ లో మిడిల్ క్లాస్ పీపుల్ ఆలోచన ధోరణ మారాల్సి ఉందన్నారు. ఇంటర్ తర్వాత చదువు మానేయటమే బెటర్ అని చెప్పటం చర్చనీయాంశంగా మారింది. డిగ్రీ పట్టాలు పొందిన గ్రాడ్యుయేట్స్ కంటే ఇంటర్ తో చదువు ఆపేసినవాళ్లే ఎక్కువ సంపాదిస్తున్నారని ఒక పాడ్ కాస్ట్ లో చెప్పారు. 

ఇండియాలో అత్యధికంగా సంపాదించేవారు గ్రాడ్యుయేట్స్ కాదని..  12వ తరగతి పూర్తి చేసి ఆ తర్వాత చదువు మానేసిన వారేనని అన్నారు. భారత విద్యా విధానం ఇప్పటికీ బట్టీ పట్టడం చుట్టూనే తిరుగుతోందని అన్నారు. బట్టీ పడ్డటం మక్కికి మక్కీ రాయడమే జరుగుతోందన్నారు.  ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్, క్లీన్ టెక్,  అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సైన్స్  వంటి వాటితో తయారవుతున్న పోటీ ప్రపంచానికి విద్యార్థులను తయారు చేయడంలో భారత విద్యా వ్యవస్థ విఫలమవుతున్నట్లు చెప్పారు. 

ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పట్టాలు పొందిన నిరుద్యోగ లెక్కలు చూస్తే అది అర్థమవుతుందన్నారు. కాలేజీల నుంచి  బయటకు వస్తున్న ప్రతి 100 మందిలో  కేవలం ముగ్గురు మాత్రమే అదే ఏడాది ఉద్యోగాలు  పొందుతున్నారని అన్నారు. 

చదువు లేని వారిలో( నిరక్షరాస్యులు) నిరుద్యోగ రేటు (అన్ ఎంప్లాయ్మెంట్) సుమారు 3 శాతం ఉండగా, డిగ్రీ, పీజీలు చేసిన వారిలో 30-40 శాతం మందిలో అనెంప్లాయ్మెంట్ ఉందన్నారు. అంటే వంద మందిలో 30 నుంచి 40 మంది ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నట్లు లెక్క. యూనివర్సిటీ  వ్యవస్థ స్కిల్స్ ను పెంపొందించకుండా విద్యార్థులను బట్టీ పట్టించడవ వరకే పరిమితమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  మీరు యూనివర్సిటీలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని సూచించారు. 

కాలేజీ చదువులకు ముందే ఇండియాలో బట్టీ పట్టే అలవాటు మొదలవుతుందన్నారు. స్కూల్స్ లో బట్టి నేర్పించడంపైనే దృష్టి పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఫలితంగా, ఇండియా  వివిధ సెక్టార్లలో  స్కిల్స్ పెంచడంలో ఇబ్బంది పడుతోందని ముఖర్జీయా అభిప్రాయపడ్డారు. దీని వల్లనే మనం  ఏఐలో సరిగ్గాలేం.. ఈవీలో లేము, బయోటెక్‌లో లేము, క్లీన్ టెక్‌లో  లేము అంటూ చెప్పుకొచ్చారు. 

కాలేజీ డిగ్రీ తగినంత వాల్యూ ఇవ్వడం లేదని ఇండియన్ కంపెనీస్ ఓనర్లు సంకేతాలు ఇస్తుననారు. ఇక్కడ అత్యధికంగా సంపాదించేవారిలో కొందరు ఇంటర్ పూర్తి చేసి, ఆ తర్వాత చదువు ఆపేసిన వారేనని ఆయన పేర్కొన్నారు. 

ముఖర్జీయా దృష్టిలో ఇది కేవలం విద్యా సమస్య మాత్రమే కాదు, ఆర్థిక సమస్య కూడా. ఆధునిక ప్రపంచంలో భారతదేశం పోటీ పడాలంటే, వ్యవస్థ బట్టీ పట్టే పద్ధతిని విడిచిపెట్టి, యువతకు ఎలా ఆలోచించాలో నేర్పించడం ప్రారంభించాలని అన్నారు.