కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: కేబినెట్లో చోటు దక్కలేదని ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ:  కేబినెట్లో చోటు దక్కలేదని ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతుల తీసుకున్న తర్వాత చేపట్టిన మొదటి మంత్రివర్గ విస్తరణలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.  మంత్రివర్గ విస్తరణపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. 

మంత్రి వర్గ విస్తరణపై అసంతృప్తితో ఉన్న   ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ రాజీనామా సోమవారం (ఆగస్టు 03) రాజీనామా చేశారు. స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపించారు. 

అదే విధంగా మరో  ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ  కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. తనతో  పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలూ రాజీనామా చేస్తారని బాంబు పేల్చారు. 

కర్ణాటక కేబినెట్ లోకి కొత్తగా 20 మందికి చోటు కల్పించారు సీఎం డీకే శివకుమార్. లోక్ భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎమ్మెల్యేల అసంతృప్తిపై సీఎం స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంయమనంతో ఉండాలని సూచించారు. పార్టీలో ఉన్న అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేము కదా అని అన్నారు. ఓపికతో ఉంటే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పారు. గతంలో తనకు కూడా మంత్రి పదవి రాలేదని.. అలాగని తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు.