అయ్యో ఎంత పని జరిగింది.. కారు డోర్ లాక్... ఊపిరాడక చిన్నారి మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

అయ్యో ఎంత పని జరిగింది.. కారు డోర్ లాక్... ఊపిరాడక చిన్నారి మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

జూలూరుపాడు, వెలుగు: కారు డోర్​ లాక్​ కావడంతో ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వినోభానగర్​ గ్రామానికి చెందిన సర్పంచ్​  గంగావత్​ నవీన్​ కూతురు తన్విత శ్రీ(4) ఆదివారం ఆడుకుంటూ కారులోకి వెళ్లగా, అనుకోకుండా డోర్  లాక్  కావడంతో బయటకు రాలేకపోయింది. 

కొద్ది సేపటి తరువాత పాప కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. చిన్నారి కారులో ఉన్న విషయాన్ని కుటుంబీకులు గుర్తించి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఊపిరాడక చిన్నారి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైరా ఎమ్మెల్యే రాందాస్  నాయక్  తదితరులు సర్పంచ్  నవీన్  కుటుంబాన్ని పరామర్శించారు.