కరీంనగర్: ఇంటి ముందు మాట్లాడుకుంటుండగా ఇద్దరు మహిళలను ఢీకొన్న కారు

కరీంనగర్: ఇంటి ముందు మాట్లాడుకుంటుండగా ఇద్దరు మహిళలను ఢీకొన్న కారు
  • ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

కరీంనగర్ క్రైం, వెలుగు: ఇంటి ముందు మాట్లాడుకుంటుండగా అతి వేగంగా వచ్చిన ఓ కారు వారిని ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కరీంనగర్ రూరల్​లో పరిధిలోని ముగ్ధుంపూర్​లో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాడి శారద(50) తన ఇంటి ముందు కూకట్ల కనుకమ్మతో నిలుచొని మాట్లాడుతోంది. ఈ క్రమంలో గోదావరిఖని నుంచి వస్తున్న ఓ కారు అతివేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలింగా శారద చనిపోయింది. కనుకమ్మ చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.