Indian Players Injury: శ్రీలంక జట్టుతో ఆగస్టు 15వ తేదీ నుంచి జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం తీవ్రమైన గాయాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా.. కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమవడం జట్టును తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
గాయాల బారిన పడ్డ కీలక ప్లేయర్స్:
ఇప్పటికే హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా లాంటి ఆటగాళ్లు గాయాల కారణంగా టీమిండియాకు దూరంగా ఉండగా.. తాజాగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా మోకాలి గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ప్లేయర్స్ వరుస గాయాలు కెప్టెన్, కోచ్‌లకు తుది జట్టును ఎంపిక చేయడంలో తీవ్ర తలనొప్పిగా మారింది.
ఫిజియో, డాక్టర్లపై బీసీసీఐ నిఘా:
ఆటగాళ్లు తరచూ గాయ పడుతుండటంపై బీసీసీఐ (BCCI) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జట్టు ప్రధాన ఫిజియో కమలేశ్ జైన్, డాక్టర్ రిజ్వాన్ ఖాన్ ల పని తీరుపై బోర్డు దృష్టి పెట్టింది. బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నిపుణుల పాత్రపై కూడా సమీక్ష జరుపుతున్నట్లు సమాచారం. ఒక జట్టులో ప్రతి స్థానానికి తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు, ఆటగాళ్లు తమ శరీరాన్ని కష్టపెట్టాల్సి వస్తుంది. ఇక్కడే సపోర్ట్ స్టాఫ్, CoE బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్లేయర్స్ ను తొందరగా బరిలోకి దింపకుండా అలర్ట్ చేయాలి.. కానీ ప్రస్తుత పరిస్థితి ఇబ్బందికరంగా మారింది, బాధ్యులందరినీ జవాబుదారీగా చేయాలని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే:
ప్రస్తుత టెస్ట్ సిరీస్ భారత్‌కు అత్యంత కీలకం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే.. భారత్ ఆడబోయే తదుపరి 9 టెస్టుల్లో కనీసం 7,8 మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యంగ్ టీమ్ ఈ లంక పర్యటనలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాల్సి ఉంది.
