బీజేపీకి ఎదురుదెబ్బలు.. దెబ్బ మీద దెబ్బ.. మొన్నటికి మొన్న జెన్ జీ ఉద్యమంతో.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేశారు.. వారం రోజుల్లోనే బీజేపీకి మరో షాక్. మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో.. రెండు స్థానాల్లో ఓడిపోయింది బీజేపీ.
మధ్యప్రదేశ్ రాష్ట్రం దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 12 వేల 221 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మెలోడీ చాక్లెట్ తినండీ.. తియ్యని వేడుక చేసుకోండి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మెలోడీ చాక్లెట్స్ పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు. ధూంధాంగా వేడుక చేసుకున్నారు.
మెలోడీ చాక్లెట్స్ తెలుసుకదా.. ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో భాగంగా.. ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి.. భారతదేశంలో తయారయ్యే మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి మెలోడీ చాక్లెట్స్ మరింత పాపులర్ అయ్యాయి. ఇప్పుడు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోయి.. కాంగ్రెస్ గెలవటంతో.. కాంగ్రెస్ కార్యకర్తలు మెలోడీ చాక్లెట్స్ పంచిపెట్టారు. మెలోడీ చాక్లెట్ తినండి.. తియ్యని వేడుక చేసుకోండి అంటూ బీజేపీ వాళ్లను ర్యాగింగ్ చేస్తున్నారు.
#WATCH | Bhopal, Madhya Pradesh: Congress workers distribute 'Melody' toffees and burst crackers as the party's candidate, Ghanshyam Singh, leads from the Datia Assembly constituency by 12,221 votes over BJP candidate Ashutosh Tiwari pic.twitter.com/yXPRbhiVv4
— ANI (@ANI) August 3, 2026
