హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: KBR పార్క్ వైపు వెళ్తున్నారా..? ఇకపై ట్రాఫిక్ ఆంక్షలు ఇలా...!

హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: KBR పార్క్ వైపు వెళ్తున్నారా..? ఇకపై ట్రాఫిక్ ఆంక్షలు ఇలా...!

హైదరాబాద్ లో KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఆదివారం ( జూన్ 21 ) కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ వన్ వేట్రయిల్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్.ట్రయిల్ రన్ నిర్వహించిన వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని అన్నారు డేవిస్.

KBR పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్స్, 7 అండర్ పాస్ ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. నిర్మాణ పనులు జరిగే రోజులు వన్ వే చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గతంలో ఒకసారి ట్రయల్ రన్ చేసామని...పలు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు గర్తించామని అన్నారు. డ్రోన్ విజువల్స్, ప్రయాణికుల.. నిపుణుల అభిప్రాయం తీసుకున్నామని...ఈ ఆదివారం మరోసారి ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు.

►ALSO READ | పవన్ కళ్యాణ్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా బాధ లేదు: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు ఈ ట్రయల్ రన్ ఉంటుందని.. 45 జంక్షన్స్ పీక్ టైమ్ లో ఇబ్బందులు ఉన్నాయి వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఈ ట్రయల్ రన్ లో 150 మంది సిబ్బంది పనిచేస్తారని.. ట్రయల్ రన్ తర్వాత వారం రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్.